Pages

Menu Bar

RT

Thursday, March 29, 2012

ASSISTANT DIRECTOR IN A.P. ECONOMICS AND STATISTICAL SERVICE. Dated:28/12/2011



ASSISTANT DIRECTOR IN A.P. ECONOMICS AND STATISTICAL SERVICE.
Dated:28/12/2011


Click Here for Detailed
NOTIFICATION NO. 33/2011


Last Date for Payment of fees
Last Date for Payment of fees 10/04/2012

Get Challan


Submit Application



Friday, March 16, 2012

KAKATIYA UNIVERSITY WARANGAL ANNUAL EXAMINATIONS – MARCH/APRIL, 2012

KAKATIYA UNIVERSITY WARANGAL. B.A I/II/III YEAR COMMON CORE (Y.W.S). THEORY ANNUAL EXAMINATIONS – MARCH/APRIL, 2012.
Kakatiya University. Kakatiya University is located in the historical City of Warangal in northern Telengana region of Andhra Pradesh. Read More ... Kakatiya Univerity is hosting Inter-University Handball Tourna. more ... B.A., B.Com, B.Sc. aNNUAL EXAMINATIONS-2012 TIME TABLE



Tuesday, March 6, 2012

శాతవాహనులు

తెలుగు వారి చరిత్ర పరిశోధనలో మొట్ట మొదట తెలుసుకొవలసిన వంశం శాతవాహనులది. క్రీ.పూ. 220 మొదలుకుని క్రీ.శ. 200 వరకు సుమారు 400 సంవత్సరాలు పాలించారు. తెలుగు చరిత్ర శీర్షికలోని మొదటి అంకం.

శాతవాహనుల పూర్వం ఆంధ్ర చరిత్రకు సంబంధించిన ఆధారాలు పెద్దగా లేవు. ఆంధ్ర ప్రాంతం మౌర్య సామ్రాజ్య అంతర్భాగంగా వుంది అనటానికి శాసన ప్రమాణాలు కనిపిస్తున్నాయి. అయితే ఆంధ్రప్రాంతాన్ని జయించిన మౌర్య చక్రవర్తి ఎవరన్నది స్పష్టంగా తెలియలేదు. చంద్రగుప్తుని ఆస్థానంలోని గ్రీకు రాయబారి మెగస్తనీస్ ఆంధ్రులకు 30 దుర్గాలు, ఒక లక్ష పదాతి దళం, మూడువేల అశ్వికదళం (గుర్రాలు), రెండువేల గజదళం (ఏనుగులు)తో పరాక్రములైన సైనిక బలం వుందని వర్ణించినాడు. మరొక గ్రీకు చరిత్రకారుడైన ఏరియస్ కూడా 30 రాజ్యములను ప్రస్థావించినాడు. దీనిని బట్టి ఆంధ్రప్రాంతం మౌర్య సామ్రాజ్యంలో విభిన్న చిన్న చిన్న గణరాజ్యాలుగా వుందని తెలుస్తున్నది.

శాతవాహనయుగము

మౌర్య సామ్రాజ్య పతన కాలంలో నెలకొన్న అస్థిర పరిసిథతులలో శాతవాహన యుగం మొదలయింది. ఉత్తరాపథం శకులు, యువనులు, పమ్లావలు మొదలగు విదేశీయుల దాడులతో అస్థిరపడింది. ఆ సమయంలో దక్షిణపథం ఐక్యత సాధించి, శాంతిభ్రదతలు కల్పించిన ఘనత శాతవాహనులకు దక్కుతుంది. శాతవాహనులు సుమారు 400 ఏళ్ళు రాజ్యం చేసారు. క్రీ.పూ. 231/230లో శాతవాహన రాజ్య స్థాపన జరిగింది. క్రీ.శ. 220 వరకు వారి పాలన సాగంది.

వంశస్థాపకుడు

శాతవాహన వంశ స్థాపకుడు సాద్వాహనుడు లేక శాతవాహనుడు, ఇతడు శ్రీముఖుని కంటే పూర్వుడు. శాతవాహన అనునది వ్యక్తి పేరు అనుటకు శాసనాలు, నాణేలు ప్రమాణాలు శాతవాహనుడు వంశస్థాపకుడే కాని ఇతను స్వతంత్ర రాజ్య స్థాపన చేయలేదు. ఆ ఘనత శ్రీముఖునికి దక్కింది. అతడు క్రీ.పూ. 231/230లో శాతవాహన రాజ్యాన్ని స్థాపించి 23 సంవత్సరాలు పాలించినాడు.

శాతవాహన రాజులు

తొలిరాజులు

శ్రీముఖుని తరువాత, అతని తమ్ముడు కన్హ క్రి.పూ 208 సింహాసనం ఎక్కి 10 సంవత్సరాలు రాజ్యం చేసాడు. శ్రీముఖుని కుమారుడు మొదటి శీతకర్ణి ఆ తరువాత రాజ్యమేలినాడు (క్రీ.పూ. 197-179) ఇతడు 18 సంవత్సరాలు పాలించినాడు. అతడు చిన్న వయసులోనే మరణించినప్పటికి తొలి శాతవాహనులలో అతను ముఖ్యుడు. అతనికి కుమారహకుశతి శ్రీమత్, కుమారశాతవాహన, వేదసిరి కుమారులు. తండ్రి మరణ సమయానికి వీరు చిన్నవారు. తల్లి నాగనకాదేవి ఈవిడ మహారథి అంగీయ రాకుమారి. భర్త మరణానంతరము తన తండ్రి త్రణకాయిరో సాయముతో రాజ్యభారం వహించింది. నాగనిక మరణానంతరం అన్నదమ్ముల మధ్య గొడవలు రేగి రాజ్యాన్ని పంచుకొని పాలించినారు.
ఆతరువాత కాలంలో ముఖ్యంగా చప్పుకోవలసింది రెండవ శీతకర్ణి. మొదటి శీతకర్ణి తరువాత వచ్చిన్నమైన రాజ్యాన్ని తిరిగి ఏకం చేసినాడు. శకులను ఓడించి మగధ, కళింగ రాజ్యాలను ఆక్రమించినాడు. ఇతడు 56 ఏళ్ళు పాలన సాగించాడు. ఇతడుక్రి.పూ. 100 ప్రాంతంలో రాజ్యం చేసాడు.
రెండో శాతకర్ణి తరువాత అపీలక, మేఘస్వాతి, కుంతల శీతకర్ణి, పులోమావి, హాలశాతవాహనులు రాజ్యం చేసారు. పులోమావి మగధ రాజు కాణ్వసుశర్మను వధించినాడు. ఇతడు క్రీ.పూ. 43-19 మధ్య రాజ్యపాలన చేసినాడు. పులోమావి 15వ శాతవాహన రాజు. క్రి.శ 6-7 మధ్య కాలంలో హాలుడు పాలించినాడు. ఇతడు స్వయంగా గాధాసప్తశతిని సంకలనం చేసినాడు. లీలావతి కావ్యం, అభిధాన చింతామణి దేశీనాయమాల మొదలైన గ్రంథాలు హాలుని కీర్తిని తరువాతి కాలాలకు నిలిపినాయి.
హాలుని తరువాతి రాజుల కాలంలో శకులు విజృంభించి శాతవాహన రాజ్యానికి గడ్డుకాలం పట్టింది. వారి రాజ్యం ఆంధ్రదేశ ప్రాంతాలకు పరిమితమయింది. శాతవాహనుల ప్రతిష్టను తిరిగి సంపాదించిన రాజు గౌతమీపుత్ర శాతర్ణి. శాతవాహనులందరిలోకి అత్యంత పేరు పొంది భారతీయ చక్రవర్తులలో ప్రముఖునిగా నిలిచాడు. క్రి.శ 75-110 మధ్య పరిపాలించాడు.
గౌతమీ పుత్ర శతకర్ణి పలు దిగ్విజయాత్రలు జరిపి తిరగి శాతవాహనుల రాజ్యాన్ని సువిశాల సామ్రాజ్యంగా మలిచాడు. నాసిక్లో అతను వేయించిన రెండు శాసనాలు, అతని తల్లి బాలశ్రీ వేయించిన శాసనం గౌతమీపుత్ర శతకర్ణి గురించి తెలుసుకోవడానికి ముఖ్య ఆధారాలు. ఇతని తల్లి బ్రాహ్మణీ. ఇతను వూదిక విద్యాధర్మతత్పరుడు. రాజకీయ కారణాలచేత పరమత సహనాన్ని కనబర్చినాడు. బౌద్ధ మతాలనుయూయిలకు దాన ధర్మములు చేసినాడు.
గౌతమీపుత్ర శాతకర్ణి తరువాత అతని కుమారుడు వాసిష్టీపుత్ర రెండో పులోమావి రాజ్యాధిపత్యం వహించారు. ఇతడు క్రీ.శ. 110-13.. కాలం మధ్య రాజ్యపాలన చేశాడు. (ఇందులోను, గౌతమీపుత్ర శాతకర్ణి కాలనిర్ణయంలోను కొన్ని విరుధ సమయాలను పలువురు చరిత్రకారులు తెల్పుతున్రాని గ్రహింపవలె) రెండో పులోమావి తండ్రి వలే జయించిన ప్రాంతాలు లేవు. ఇతని కాంలోనే శాతవాహనుల వైభవం తగ్గడం ప్రారంభమైందని చెప్పవచ్చు.
రెండో పులోమావి తరువాత శివశ్రీశీతకర్ణి రాజ్యమేలినాడు. మహాక్షాత్తప రుద్రదాముని కుమార్తె రుద్రదామునికను పెండ్లి చేసుకున్నాడు. అయినప్పటికి క్షాత్రపులతో సమరం తప్పలేదు. రుద్రధాముడు అతనిని ఓడించి అల్లుడని విడిచిపెట్టినట్లు జూనాగడ్ శాసనం వల్ల తెలుస్తున్నది.
శాతవాహన రాజులలో శివశ్రీ శ్రీతకర్ణి తరువాత యజ్ఞశ్రీ శాతకర్ణి చివరివాడు. ఆంధ్రపదేశ్, మధ్యప్రదేశ్, బిరార్, కొంకణ, సౌరాష్ట్ర, మహారాష్ట్ర ప్రాంతాలలో దొరికిన ఇతని నాణేలను బట్టి యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహన రాజ్యాన్ని పూర్వం వలే విస్తరింపచేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ బౌద్ధ మతాచార్యుడైన నాగార్జునా చార్యుని పోషించినాడని ప్రతీతి.
యజ్ఞశ్రీ మరణానంతరం శాతవాహన రాజ్యం క్షిణించి త్వరలోనే నశించింది.

శాతవాహన యుగ విశేషాలు

ధర్మశాస్త్ర సమ్మతమైన రాచరికం శాతవాహనుల రాజ్యాంగానికి మూలం. రాజు సర్వసైన్యాధక్షుడు. పరిపాలనాధ్యక్షుడు. మంత్రుల ఆజ్ఞ సాయముతో రాజు పాలించేవాడు. రాజే ఆజ్ఞలు జారీ చేసేవాడు. ధర్మశాష్ట్రసమంతమైన పన్నులు వసూలు చేసి ప్రజలకవసరమైన సంస్థలను పోషించేవాడు. శాతవాహన సామ్రాజ్యం కేంద్రీకృత రాజరికం కాదు. వారి కింద అనేక సామంతరాజ్యాలుండేవి. సామతరాజులు ప్రాంతాలు కాని ప్రదేశాలను రాజు పాలించేవాడు. అనేక ఉన్నతోద్యోగులు రాజ్యపాలనకి సహకరించేవారు. నగరాలన్నింటిలోను కార్యాలయాలు ఉండేవి (Records offices) ధన రూపంలో జీతాలు ఇచ్చేవారు. '' దేయమేయ'', ''రాజభాగం'' అనే పేర్లతో పంటలో రాజుకు భాగం వుండేది. భూమి పనున, వృత్తి పన్నులు వసూలు చేసేవారు. రాజు ప్రత్యక్ష పాలనలో ఉన్న ప్రాంతాలు ( అంటే సామంత రాజ్యాలు కాని సామ్రాజ్య భాగం) '' ఆహారాలు'' అనే రాష్ట్రాలుగా విభజించచారు. ప్రతి రాష్ట్ర రాజధానిలోను సైన్యాగారాలు ఉండేవి. నగరాలకు రక్షణగా దుర్గనిర్మాణం ఉండేది. రాష్ట్ర పాలనకు '' ఆమాత్యులను'' రాజు నియమించేవాడు. వారిని తరచు బదిలీ చేస్తుండేవాడు. ఆమాత్యులకు వంశపారంపర్య మక్కులల ఉండేవి కావు. పరిపాలనకు గ్రామం ప్రాతిపదిక.

సాంఘిక పరిస్థితులు

సంఘంలో ‘చతుర్వర్ణ వ్యవస్థ’ ఏర్పడింది. పితృస్వామ్య ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. కుటుంబ పెద్దను ‘గహపతి’ (గృహపతి) అని పిలిచేవారు. గౌతమీపుత్ర శాతకర్ణిని ‘వినివర్తిత చతుర్వర్ణ సాంకస్య’ అని ‘నాసిక్ శాసనం’ వర్ణించింది. బ్రాహ్మణులకు సంఘంలో ప్రత్యేక గౌరవం ఉండేది. వృత్తిని బట్టి కులాలు, ఉపకులాలు ఏర్పడ్డాయి. సంఘంలో స్త్రీకి గౌరవం లభించేది. స్త్రీలకు ఆస్తి హక్కులుండేవి. ఆనాటి బౌద్ధ విహారాలకు స్త్రీలే ఎక్కువ దానధర్మాలు చేశారు. గౌతమీపుత్ర ‘వాసిష్టీపుత్ర’ అనే మాతృసంజ్ఞలు స్త్రీలకు ఉన్న గౌరవాన్ని సూచిస్తున్నాయి. స్త్రీ, పురుషులు ఒకే విధమైన ఆభరణాలు ధరించేవారు. జూదం, నాట్యం, సంగీతం ఆనాటి ప్రజల వినోదం. అమరావతి కార్లే శిల్పాల్లో స్త్రీ-పురుషులను వివిధ భంగిమల్లో అలంకారాలతో తీర్చిదిద్దారు. శాతవాహనుల సమకాలికులైన శకులు, యవనులు, పహ్లవులు, వైదిక బౌద్ధమతాలను అవలంభించారు. ధర్మదేవ, అగ్ని వర్మన్, రుషభదత్త మొదలైన హిందువుల పేర్లను పెట్టుకున్నారు. శకరాజైన రుషభదత్తుడు రాజస్థాన్‌లో పుష్కర ప్రాంతానికి యాత్రలు చేసి బ్రాహ్మణులకు గోవులు, గ్రామాలు దానం చేశాడు. గాధాసప్తశతి ఆనాటి ప్రజల జీవిత, ఆచార- వ్యవహారాలను చక్కగా వర్ణించింది.


మత పరిస్థితులు: 
శాతవాహన తొలిరాజులు వైదిక మతాన్ని పోషించారు. మొదటి శాతకర్ణి రెండు అశ్వమేధ, ఒక ‘రాజసూయ’ యాగం చేసినట్లు అతని భార్య ‘నాగనిక’ వేయించిన ‘నానాఘాట్ శాసనం’ తెలుపుతుంది. గౌతమీపుత్ర శాతకర్ణికి ‘ఏకబ్రాహ్మణ’, ‘ఆగమనిలయ’ అనే బిరుదులుఉన్నాయి. వైదిక మతంతో పాటు శివుడిని కూడా ఆరాధించేవారని గాధాసప్తశతి పేర్కొంది. సంరక్షణ వాసుదేవాయతనం నిర్మించిన ప్రాకారాన్ని క్రీ.పూ. 2వ శతాబ్దం నాటి ‘ఘోసండి’ శాసనం ప్రస్తావించింది. మధ్యప్రదేశ్ ‘విదిశ’ ప్రాంతంలో హెలియోడోరస్ క్రీ.పూ. 1వ శతాబ్దంలో వేసిన స్తంభ శాసనం ‘భాగవత మతం’ గురించి ప్రస్తావించింది. శాతవాహన రాజుల్లో కృష్ణ, వేదశ్రీ, శకిశ్రీ, యజ్ఞనుశ్రీ పేర్లను బట్టి వైదిక ధర్మాన్ని ఆచరించినట్లు తెలుస్తుంది. శివ -కేశవులు, రాధా- కృష్ణులను ఆరాధించే వారని గాధాసప్తశతి పేర్కొంది. ప్రజలు గ్రామ దేవతలు, చెట్లు - పుట్టలు, సర్పాలను ఆరాధించేవారు.

బౌద్ధ మతం: క్రీ.పూ. రెండో శతాబ్దం నుంచి, మూడో శతాబ్దం వరకు పశ్చిమ, తూర్పు, దక్కన్ ప్రాంతాల్లో బౌద్ధం విశేష ఆదరణ పొందింది. స్థూపాలు, చైత్యగృహాలు, విహారాలకు వృత్తి పనివారు, వర్తక శ్రేణులు, స్త్రీలు విరివిగా దానాలు చేశారు. శాతవాహన తొలి రాజు కృష్ణుడు (కన్హ) బౌద్ధ బిక్షువుల కోసం నాసిక్‌లో గుహాలయం నిర్మించాడు. గౌతమీ బాలశ్రీ, రెండో పులోమావి కార్లేలో మహా సాంఘికులకు గుహదానం చేశారు. రుషభ దత్తుడు గోవర్పనలో గుహ నిర్మాణానికి నాలుగు వేల ‘కార్షాపణులు’ (వెండి నాణేలు) బౌద్ధ భిక్షువులకు దానం చేశాడు. నాసిక్, కార్లే, కన్హౌరి, కుడ, భాజా, బేడ్సా, అజంతా వంటి గుహలు దక్కన్ పశ్చిమ ప్రాంతంలో భిక్షువుల కోసం నిర్మించారు. తూర్పు తీరంలో అమరావతి, భట్టిప్రోలు, జగ్గయ్యపేట, గుంటుపల్లి, శాలిహుండం, రామ తీర్థం, బుద్ధన్నకొండ ప్రాంతాల్లో అనేక బౌద్ధ వాస్తు నిర్మాణాలు చేశారు. బౌద్ధమతంలో అనేక శాఖలు విస్తరించాయి. వీటిలో అంధక శాఖ (ఆంధ్రులు), బాదనీయ శాఖ (నాసిక్), మహా సాంఘికులు (కార్లై), దమ్మ మత్తరీయలు (సోపార), చైత్యకులు (అమరావతి), పూర్వ శైలీయులు, అపర శైలీయులు (నాగార్జున కొండ) ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


జైనమతం:  
శాతవాహన యుగంలో జైన మత ఆదరణ తక్కువ. రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు మొదట జైన మతాన్ని అనుసరించాడు. ప్రసిద్ధ జైనమతాచార్యుడు ‘కొండ కుందాచార్యుడు’ శాతవాహనులకు సమకాలికుడు. ఇతడు సమయసారం అనే గ్రంథం రచించాడు. ఇది ‘శ్వేతాంబర’, ‘దిగంబర’ జైన శాఖీయులకు ప్రమాణ గ్రంథం. తొలి శాతవాహనులు జైన మతాన్ని పోషించినట్లు ఆవశ్య సూత్రం, కల్ప ప్రదీప, ప్రభావిక చరిత్ర గ్రంథాలు తెలుపుతున్నాయి. గుంటూరు జిల్లా వడ్డమాను కొండ వద్ద లభించిన పురావస్తు అవశేషాలు శాతవాహనుల కాలాన్ని సూచిస్తాయి.

భాషా సారస్వతాలు: శాతవాహనుల రాజభాష ప్రాకృతం. బ్రహ్మీలిపి. శాతవాహనులు పశ్చిమ క్షాత్రపుల శాసనాలన్నీ ప్రాకృత భాషలో లిఖించారు. క్రీ.పూ. 3వ శతాబ్దంలో ప్రాకృత భాష - బ్రహ్మీలిపి బహుళ ప్రజాదారణ పొందాయి. హాలుడు 700 శృంగార పదాలతో గాధాసప్తవతిని ప్రాకృత భాషలో సంకలనం చేశాడు. దీని నుంచే ‘అమృతం ప్రాకృత కావ్యం’ అనే సూక్తి ఏర్పడింది. ఇతడికి ‘కవి వత్సలుడు’ అనే బిరుదు ఉంది. ఇతని ఆస్థానంలో కుమారిల, శ్రీ పాలితుడు ముఖ్యులు. శాతవాహన మంత్రి గుణాఢ్యుడు పైశాచ భాషలో (ప్రాచీన ప్రాకృత భాష) ‘బృహత్కథను’ రచించాడు. దీని ఆధారంగా క్షమేంద్రుడు బృహత్కథాసార సంగ్రహం, సోమదేవసూరి - కథా సరిత్సాగరం సంస్కృత భాషలో రచించారు. ధనపాలుడు- తిలకమంజరీ, బుధస్వామిన్- బుద్ధకథా శీర్షిక, బృహత్కథా శ్లోక సంగ్రహం, సంస్కృత భాషలో రచించారు. ఈ సంస్కృత గ్రంథాలన్నీ మలిశాతవాహనుల కాలంలో వచ్చాయి. శర్వ వర్మన్ - కాతంత్ర వ్యాకరణ గ్రంథం సంస్కృతంలో రచించాడు. కుతూహలుడు, లీలావతి పరిణయం ప్రాకృతంలో రచించాడు. కొండకుందాచారి సమయసారం రచించాడు. శక రుద్రదమనుడు క్రీ.శ. 150లో గిర్నార్ శాసనాన్ని సంస్కృత భాషలో వేయించాడు. గాధాసప్తశతిలో అనేక దేశీయ పదాలు కనిపిస్తాయి. విద్యాబోధన బ్రాహ్మణ ఆశ్రమాలు, బౌద్ధ విహారాల్లో జరిగేది. ప్రముఖ విద్యా కేంద్రాల్ని ఘటికలు (ఉన్నత విద్యా కేంద్రాలు) అనేవారు. శ్రీపర్వతం (నాగార్జున కొండ) ప్రముఖ విద్యాకేంద్రంగా ప్రసిద్ధి చెందింది.


మాధ్యమిక వాద సిద్ధాంత కర్త, ఆచార్య నాగార్జునుడు తన గ్రంథాలన్నీ సంస్కృత భాషలోనే రచించాడు. ప్రజ్ఞా పారమిత శాస్త్రం, మూల మాధ్యమిక శాస్త్రం, ద్వాదశ నికాయ శాస్త్రం, శూన్య సప్తతి, సుహృల్లేఖ, యోగాచార శాస్త్రం, రస రత్నాకరం, రతి శాస్త్రం.. వీటిని సంస్కృతం నుంచి చైనా భాషలోకి అనువదించారు. భారతీయ తర్కశాస్త్రానికి నాగార్జునుడిని పితామహుడిగా పేర్కొంటారు. రెండో తథాగతుడు, ఇండియన్ ఐన్‌స్టీన్, ఇండియన్ మార్టిన్ లూధర్ అనే బిరుదులు నాగార్జునుడికి ఉన్నాయి.


వాస్తు నిర్మాణాలు: శాతవాహనుల కాలంలో భవన నిర్మాణానికి మట్టి, ఇటుకలు, వెదురు బొంగులు వినియోగించేవారు. రాతి గుహల్లో స్థూపాలు, చైత్య గృహాలు, విహారాలు నిర్మించారు. మహా చైత్యం (స్థూపం), బుద్ధుడి అవశేషాలపై నిర్మించారు. ఆంధ్రదేశంలో భట్టిప్రోలు స్థూపం అతి ప్రాచీనమైంది. నాగార్జున కొండ, అమరావతి, ఘంటశాల, చందవోలు స్థూపాలకు ప్రసిద్ధి. బౌద్ధ బిక్షువుల నిత్య పూజ కోసం నిర్మించినవే చైత్యగృహాలు. ముందు భాగం చతురస్రం, వెనుక భాగం వంపుగా ఉంటూ, మధ్య భాగంలో బుద్ధుడి ప్రతిమ ఉంటుంది. చైత్యం గజపృష్టాకారంలో ఉంటుంది. ఆంధ్రాలో చేజర్ల, గుంటుపల్లి, శాలిహుండం (శ్రీకాకుళం), విద్యాధరపురం (విజయవాడ), రామతీర్థం (విజయనగరం జిల్లా) ప్రసిద్ధ చైత్య నిర్మాణాలు. పశ్చిమ తీరంలో కార్లీ, భాజ, బేడ్సా, కన్హౌరీ ప్రసిద్ధి గాంచిన చైత్య గృహాలు. కొండల్ని తొలిచి వీటిని నిర్మించారు. బౌద్ధ బిక్షువులు నివసించడానికి ఏర్పాటు చేసినవే ‘వసతులు’. ఇవి చిన్న చిన్న గదులుగా ఉంటాయి. ఆంధ్ర దేశంలో రామతీర్థం, శాలిహుండం, కోరుకొండ, గుంటుపల్లి, విజయవాడ గుహ-విహారాలుగా ప్రసిద్ధి పొందాయి. నాగార్జున కొండ, అమరావతిల్లో ఇటుకలతో నిర్మించిన విహారాలు కనిపిస్తాయి. శాతవాహనుల కాలం నాటి చిత్రకళ అజంతా, ఎల్లోరా, పితల్ కోరా, జునార్ గుహల్లో కనిపిస్తుంది. అజంతా 9, 10 గుహల్లో ఆంధ్రులు చిత్రించిన చిత్రలేఖనాలున్నాయి.


గుంటుపల్లి గుహలు: పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు దగ్గర కామవరపు కోట సమీపంలో ఉన్నాయి. కొండపై చైత్య గృహం, విహారం నిర్మించారు. ఇవి క్రీ.పూ. 200 సంవత్సరాల నాటివి.


శంకరం గుహలు: విశాఖ జిల్లా, అనకాపల్లికి 2 మైళ్ల దూరంలో ఉన్నాయి. విహారాలు, చైత్యాలు నిర్మించారు. క్రీ.శ. 4వ శతాబ్దం నాటి సముద్ర గుప్తుడి బంగారు నాణెం లభించింది. గుర్రం ముద్రలున్న శాతవాహన నాణేలు, వేంగీ చాళుక్యుడు, కుబ్జ విష్ణు వర్థనుడి రాగి నాణేలు లభించాయి.


రామతీర్థం గుహలు: విజయనగరానికి 8 మైళ్ల దూరంలో ఉన్నాయి. గురుభక్త కొండ మీద మహా చైత్యం (స్థూపం), చైత్య గృహాలు ఉన్నాయి. ప్రాకృత భాషలో ఉన్న రెండు ముద్రికలు ఇక్కడ లభించాయి.

శాలిహుండం: శ్రీకాకుళం జిల్లాలో వంశధార నది ఒడ్డున ఈ గ్రామం ఉంది. దీనికి దక్షిణ దిశలో ఉన్న కొండ మీద చైత్య గృహాలున్నాయి. క్రీ.శ. 8, 9 శతాబ్దాలకు చెందిన మారీచ, తారా, అవలోకితేశ్వర వంటి వజ్రయానానికి చెందిన 12 బౌద్ధ విగ్రహాలు లభించాయి.

చేది వంశం:
 
శాతవాహనుల సమకాలీన వంశం. ఈ వంశానికే మహామేఘవాహన వంశమని పేరుంది. స్వతంత్ర కళింగ రాజ్య స్థాపనకు మూల పురుషులు ఈ వంశీయులు. ఈ వంశంలో ఖారవేలుడు ముఖ్యుడు. ఇతడికి ‘కళింగాధిపతి, కళింగ చక్రవర్తి’ అనే బిరుదులు ఉన్నాయి. ఇతడు ఒరిస్సాలో ఉదయగిరి గుహల్లో హాతిగుంఫా శాసనాన్ని వేశాడు. ఇతడు క్రీ.పూ. 2వ శతాబ్దానికి చెందినవాడు. శాతవాహన రెండో శాతకర్ణి ఇతడికి సమకాలికుడు. ఖారవేలుడు జైన మతస్థుడు. ఉదయగిరి (కుమారగిరిపై) జైన పరిషత్ నిర్వహించి, జైన మత గ్రంథాలను క్రోడీకరించాడు. తన రాజధాని నగరంలో ‘మహా విజయ ప్రాసాదం’ నిర్మించాడు.

శాతవాహనాంతర రాజవంశాలు


సుమారు నాలుగున్నర శతాబ్దాల పాటు దక్షిణాపథాన్ని ప్రధానంగా ఆంధ్ర దేశాన్ని పాలించిన శాతవాహన రాజవంశం క్రీ.శ. 3వ శతాబ్ది ప్రారంభంలో అస్తమించింది. ఈ సమయంలో వారి సామంతులు, మాండలిక ప్రభువులు స్వతంత్రులయ్యారు. ఈ రాజవంశాలు నాలుగు శతాబ్దాల కాలం (క్రీ.శ. 200-614) దక్షిణాపథాన్ని పాలించాయి. వారిలో ఇక్ష్వాకులు, బృహత్పలాయనులు, ఆనందగోత్రులు, శాలంకాయనులు, విష్ణుకుండినులు, పల్లవులు ముఖ్యులు. వీరితో పాటు చుటు వంశీయులు- బనవాసి (మైసూరు), ఆభీరులు (మహారాష్ట్ర ప్రాంతాన్ని), వాకాటకులు (విదర్భ ప్రాంతాన్ని), కంచిలో పల్లవులు కూడా రాజకీయాధికారాన్ని చేపట్టారు.


ఇక్ష్వాకులు: 
 ఇక్ష్వాకులు విజయపురి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని కృష్ణా-గుంటూరు ప్రాంతాన్ని యాభై ఏళ్లకు పైగా పాలించారు. పురాణాలు వీరిని ‘శ్రీపర్వతీయ ఆంధ్రులని’ పేర్కొంటున్నాయి. నాగార్జునకొండకు శ్రీపర్వతమనే పేరు ఉన్నట్లు ఇక్కడ లభించిన ప్రాకృత శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక్ష్వాకులు బుద్ధుడి వంశం వారని, బుద్ధుడు ఇక్ష్వాకు రాజ వంశీయుడని నాగార్జునకొండ ప్రాకృత శాసనాల్లో ప్రస్థావించారు. ‘ఇక్షు’ (చెరుకుగడ) చిహ్నాన్ని తమ తెగకు గుర్తింపుగా చేసుకోవడం వల్ల వీరు ఇక్ష్వాకులై ఉంటారని బి.ఎస్.ఎల్. హనుమంతరావు అభిప్రాయపడ్డారు.

ఇక్ష్వాకు రాజ్య స్థాపకుడు వాసిష్టీపుత్ర శ్రీఛాంతమూలుడు. ఇతడు (క్రీ.శ. 200-218) మధ్య కాలంలో రెండు దశాబ్దాలు పాలించినట్లు గుంటూరు జిల్లాలో లభించిన రెంటాల, కేసనపల్లి శాసనాలు పేర్కొంటున్నాయి. ఇతడు గొప్ప విజేత. ఇతని రాజ్యం క్షాత్రపుల ఉజ్జయిని, బనవాసి (మైసూరు) వరకు విస్తరించింది. ఛాంతమూలుడు ధనక, పూగియ వంశాలతో మైత్రీ, వివాహ సంబంధాలు నెలకొల్పాడు. ఇతడు శైవుడు. కార్తికేయుని భక్తుడు. కోవి, హిరణ్య, గో, హల, సహస్ర ప్రదాత, అప్రతిహత శాసనుడు, వాసిష్టీపుత్రుడిగా ఛాంతిసిరి వేయించిన నాగార్జునకొండ శాసనం వర్ణించింది. చాంతమూలుడు అశ్వమేధ, రాజసూయ యాగాలు చేసి, సామ్రాట్, సార్వభౌమ బిరుదులు పొందాడు.


శ్రీవీరపురుషదత్తుడు (క్రీ.శ. 218-238): శ్రీఛాంతమూలుడి తర్వాత అతని కుమారుడు శ్రీవీరపురుషదత్తుడు 20 ఏళ్లు పాలించాడు. మహారాజ-మాఢరీపుత్ర శ్రీపురుషదత్తుడని నాగార్జునకొండ, జగ్గయ్యపేట శాసనాలు పేర్కొన్నాయి. ఉజ్జయిని రాజైన రెండో శకరుద్రసేనుని కుమార్తె రుద్రధరభట్టారికను వివాహం చేసుకున్నాడు. ఇతని కాలంలో బౌద్ధమతం స్వర్ణయుగంగా భాసిల్లింది. శ్రీపర్వత ప్రాంతం గొప్ప ధార్మిక, సాంస్కృతిక కేంద్రంగా వర్ధిల్లింది. నాగార్జునకొండ మహాచైత్యాన్ని (స్థూపం) భదంత ఆనందుడు అనే ఆచార్యుడి పర్యవేక్షణలో ఇతడు పునరుద్ధరించాడు.


తెలుగు జనరల్ నాలెడ్జ్ బిట్స్ Telugu Gk Bits

తెలుగు జనరల్ నాలెడ్జ్  బిట్స్ ,తెలుగు జనరల్  బిట్స్  Telugu Gk , జనరల్ నాలెడ్జ్  బిట్స్  Telugu Gk బిట్స్, తెలుగు గక్ Books డౌన్లోడ్, స్టడీ బిట్స్, Telugu Bits
1. మనదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది?
జ : గోండులు. (వీరి సంఖ్య 40 లక్షలు)
2 మనదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది?
జ : గోండులు. (వీరి సంఖ్య 40 లక్షలు)
3 యూరప్‌లో నదిపై లేని ఏకైక రాజధాని నగరం ఏది?
జ : స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌.
4 దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు?
జ : డా. అక్కినేని నాగేశ్వర్‌రావు
5 ప్రపంచంలో అతి పొడవైన తీర రేఖ కలిగిన దేశం ఏది?
జ : కెనడా. (దీని తీరరేఖ పొడవు 2,02,080 కి.మీ.)
6 బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఏ పేరుతో పిలుస్తారు?
జ : ది హాంగ్‌
7 గంగానదిని బంగ్లాదేశ్‌లో ఏ పేరుతో పిలుస్తారు?
జ : పద్మానది
8 గంగానది పొడవు ఎంత?
జ : 2,523 కి.మీ.
9 ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఇతిహాసం ఏది?
జ : మహాభారతం. (ఇందులో 74 వేల పద్యాలు, 1.8 లక్షల పదాలు ఉన్నాయి)
10 మహిళలకు ఓటు హక్కు కలిపించిన తొలి దేశం ఏది?
జ : న్యూజీలాండ్‌.
11 భారతదేశంలో మొదటి 'మున్సిపల్‌ కార్పోరేషన్‌'ను ఎక్కడ స్థాపించారు?
జ : మద్రాసులో
12 భారతదేశంలో మొట్టమొదటి 'పట్టణాభివృద్ధి సంస్థ'ను ఎక్కడ ఏర్పాటు చేసారు?
జ : ఢిల్లిలో. (1964)
13 శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏది?
జ : రోహిణి.
14 భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) మొదటి చైర్మన్‌ ఎవరు?
జ : విక్రం సారభాయ్‌
15 స్వదేశీ పరిజ్ఞానంతో మనదేశం నిర్మించనున్న అంతరిక్ష నౌక పేరేమిటి?
జ : అవతార్‌
16 ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌, ఇస్రోలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఉపగ్రహ ఆధారిత నావిగేషన్‌ వ్యవస్థ పేరేమిటి?
జ : గగన్‌
17 అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు రాకేశ్‌ శర్మ ప్రయాణించిన వాహక నౌక పేరేమిటి?
జ : సోయజ్‌
18 భారతదేశం ప్రయోగించిన మొదటి వాతావరణ ఉపగ్రహం 'మెట్‌శాట్‌'కు ఏ పేరు పెట్టారు?
జ : కల్పన - 1
19 అంతరిక్ష యానం చేసిన తొలి భారతీయ మహిళ పేరేమిటి?
జ : కల్పనా చావ్లా
20 అంతరిక్షయానం చేయనున్న మొదటి భారత టూరిస్ట్‌ ఎవరు?
జ : సంతోష్‌ జార్జ్‌ కులంగర్‌.
21 భారత దేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరేమిటి?
జ : ఆర్యభట్ట (1975 ఏప్రిల్‌ 19న ప్రయోగించారు)
22 ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఎక్కడ ఉంది?
జ : తిరువనంతపురంలో
23 అంతరిక్ష ప్రయోగాల కోసం ఇండియన్‌ స్పేస్‌ రీసర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో)ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
జ : 1969లో.
24 'ఇస్రో' ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
జ : బెంగుళూరులో.
25 ఇనుప వస్తువులను కూడా తిని ఆరగించుకోగల జంతువు ఏది?
జ : మొసలి
26 ప్రపంచ బ్యాంక్‌ ప్రస్తుత ప్రెసిడెంట్‌ పేరేమిటి?
జ : రాబర్ట్‌ జోలిక్‌.
27 'లా కమీషన్‌' ప్రస్తుత చైర్మన్‌ పేరేమిటి?
జ : పి. వెంకటరామిరెడ్డి.
28 నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమీషన్‌ (కఐఈ) ప్రస్తుత చైర్మన్‌ ఎవరు?
జ : జస్టిస్‌ కె.జి.బాలకృష్ణన్‌.
29 2010 సంవత్సరానికిగాను 'టైమ్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌' గా ఎవరు ఎంపికయ్యారు?
జ : మార్క్‌ జుకెర్‌బర్గ్‌ . (ఫేస్‌ బుక్‌ ఫౌండర్‌)
30 2010 సంవత్సరానికిగాను'రాజీవ్‌ ఖేల్‌రత్న' అవార్డు ఎవరికి లభించింది?
జ : సైనా నెహ్వాల్‌కు
31 'యునైటెడ్‌ నేషన్స్‌' పేరును ఎవరు సూచించారు?
జ : ఫ్రాంక్లిన్‌ డి రూజ్‌వెల్ట్‌.
 ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రెటరీ జనరల్‌ ఎవరు?
జ : బాన్‌ కీ మూన్‌. (దక్షిణ కొరియా)
32 'సార్క్‌' మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది?
జ : బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా (1985)లో
33 'సార్క్‌'లో 2007లో 8వ దేశంగా చేరిన దేశం ఏది?
జ : అఎn్గానిస్తాన్‌.
34 2011 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి ఏ సంవత్సరంగా ప్రకటించింది?
జ : అంతర్జాతీయ అడవుల సంవత్సరం, అంతర్జాతీయ రసాయన సంవత్సరం.
35 ప్రపంచంలో జనాభా లేని ఖండం ఏది?
జ : అంటార్కిటికా (దీనికి మంచు ఖండం అనికూడా పేరు)
36 'జీ-8' కూటమిలోని దేశాలు ఏవి?
జ : అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, కెనడా, జపాన్‌, జర్మనీ.
37 రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (ఆూ) ప్రస్తుత డైరెక్టర్‌ పేరేమిటి?
జ : సంజీవ్‌ త్రిపాది
38 లోక్‌సభ ప్రస్తుత సెక్రటరీ జనరల్‌ పేరేమిటి?
జ : టి.కె. విశ్వనాథన్‌
39 రాజ్యసభ ప్రస్తుత సెక్రటరీ జనరల్‌ పేరేమిటి?
జ : వివేక్‌ కుమార్‌ అగ్నిహోత్రి
40 యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ (ీాఈ) ప్రస్తుత చైర్మన్‌ ఎవరు?
జ : ప్రొఫెసర్‌ డి.పి. అగర్వాల్‌.
41 'బీసీ'ల జాతీయ కమీషన్‌ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు?
జ : జస్టిస్‌. ఎం.ఎన్‌.రావు.
42 యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమీషన్‌ (ీఏఈ) ప్రస్తుత చైర్మన్‌ పేరేమిటి?
జ : ప్రొఫెసర్‌ వేద్‌ ప్రకాశ్‌.
43 ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఒఇ) ప్రస్తుత డైరెక్టర్‌ ఎవరు?
జ : నెహ్‌చాల్‌ సంధు.
44 నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌ ్స (కాఏ) ప్రస్తుత డైరెక్టర్‌ జనరల్‌ ఎవరు?
జ : ఆర్‌.కె.మెదెకర్‌
45 లోక్‌సభ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ పేరేమిటి?
జ : కరియా ముందా.
46 ఐక్యరాజ్యసమితి జనాభా లెక్కల ప్రకారం 2060 నాటికి భారతదేశం జనాభా ఎంత పెరుగుతుంది?
జ : 171.8 కోట్లకు
47 అంతర్జాతీయ ద్రవ్యనిధి నూతన మేనేజింగ్‌ డైరెక్టర్‌ పేరేమిటి?
జ : క్రిస్టిన్‌ లాగార్డే.
48 కొత్తగా ఇటీవల అవతరించిన దక్షిణ సూడాన్‌ రాజధాని పేరేమిటి?
జ : జుబా.
49 భారత నూతన సొలిసిటర్‌ జనరల్‌ పేరేమిటి?
జ : రోహింగ్టన్‌ నారిమన్‌.








* ప్రపంచ బ్యాంక్ ఎక్కడ ఉంది?
          జ)  వాషింగ్ టన్.
    * ఎక్కువ జీవిత కాలం కల్గిన జంతువు?
          జ)  తాబేలు.
    * తక్కువ సాంద్రత కల్గిన పదార్థం?
          జ)  చెక్క
    * మహా భారతానికి గల మరో పేరు?
          జ)  జయ సంహిత.
    * హిమోగ్లోబిన్‌లో ఉన్న లోహం?
          జ)  ఐరన్.
    * రామచరిత మానస్ ను రచించింది ఎవరు?
          జ)  తులసీ దాస్.
    * నవ్వించే వాయువు ఏది?
          జ)  నైట్రస్ ఆక్సైడ్.
    * ప్రపంచ పర్యావణ దినముగా ఏ రోజు జరుపబడును?
          జ)  జూన్ 5.
    * చంద్రుని పై మొదట కాలిడిన తొలి మానవుడు?
          జ)  నీల్ ఆమ్ స్ట్రాంగ్.
    * రెడ్ ప్లానట్‌గా పిలువబడే గ్రహం ఏది?
          జ)  మార్స్.
    * రేడియం దేనినుండి లభిస్తుంది?
          జ)  పిచ్ బ్లెండ్.
    * అత్యధిక జనభా గల దేశమేది?
          జ)  చైనా.
    * శ్వేత విప్లవం దేనికి సంబంధించింది?
          జ)  పాల ఉత్పత్తి.
    * సప్త పర్వతముల నగరం' అని దేనికి పేరు?
          జ)  రోమ్.
    * తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు?
          జ)  సెరి కల్చర్.
    * ఏ దశాబ్దాన్ని సార్క్ పేదరిక నిర్మూలన దశాబ్దంగా ప్రకటించింది
          జ)  2005-2015.
    * భారతదేశంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల చిహ్నాలను కేటాయించేది?
          జ)  ఎన్నికల సంఘం.
    * ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
          జ)  జెనీవా.
    * డచ్ ఈస్ట్ ఇండీస్ కొత్త పేరు ఏది?
          జ)  ఇండోనేసియా.
    * ఆంధ్రరత్న అని ఎవరిని అంటారు?
          జ)  దుగ్గిరాల గోపాలకృష్ణయ్య.
    * భారతదేశ అధికార మతం?
          జ)  లౌకికరాజ్యం కనుక అధికార మతం ఉండదు.
    * మతం ప్రజల పాలిట నల్లమందు అని ఎవరు అన్నారు?
          జ)  కారల్ మార్క్స్.
    * ఎన్నికలలో ఓటు వేయడం అనేది ఏ హక్కు?
          జ)  రాజకీయ హక్కు
    * డిపెండింగ్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు?
          జ)  జశ్వంత్‌సింగ్.
    * మన సౌరకుటుంబంలో ఈ గ్రహంలో మాత్రమే జీవరాశి ఉంది?
          జ)  భూమి.
    * ఐక్యరాజ్య సమితి ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?
          జ)  న్యూయార్క్
    * భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు?
          జ)  ఆంధ్రప్రదేశ్.
    * మనదేశంలో ఎన్ని పోస్టల్ జోనులున్నాయి?
          జ)  ఎనిమిది.
    * మనదేశంలో ఎన్ని రాష్ట్రలున్నాయి?
          జ)  28.
    * డేవిస్ కప్ ఏ క్రీడకు సంబంధించినది?
          జ)  టెన్నిస్
    * పద్మశ్రీ గెల్చుకున్న తొలినటి?
          జ)  నర్గిస్ దత్
    * హర్ష చరిత్రను ఏ భాషలో రాశారు?
          జ)  సంస్కృతం
    * పాలను పెరుగుగా మార్చే ఎంజైయం ఏది?
          జ)  రెనిన్.
    * మానవుని మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉంటాయి?
          జ)  చిక్కుడు గింజ ఆకారంలో.
    * మానవునిలో ఎన్ని మూత్రపిండాలుంటాయి?
          జ)  2.
    * ప్రపంచంలో ఎక్కువ ముస్లింలు ఉన్న దేశం ?
          జ)  ఇండియా.
    * ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్ లను రద్దు చేయాలని సూచించిన కమీషన్ ఏది?
          జ)  రాజా మన్నార్ కమీషన్.
    * సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ ఏ సం|| నుండి వేరు చేశారు?
          జ)  1924.
    * ప్రస్తుతం భారతదేశంలో దాదాపుగా ఎన్ని పోస్టాఫీస్‌లు గలవు?
          జ)  1 లక్ష యభై వేలు.
    * వైట్ కోల్ ' అని దేనిని పిలుస్తారు ?
          జ)  వజ్రం.
    * మనదేశంలో మొబైల్ ఎ.టి.ఎమ్. సర్వీసును మొట్టమొదట అందించిన వాణిజ్య బ్యాంక్ ఏది?
          జ)  ఐ.సి.ఐ.సి.ఐ.
    * 2005 సవస్తరంలో అత్యధిక జననాల రేటు నమోదైన దేశం ఏది?
          జ)  భారత్.
    * అధిక సంఖ్యలో అణు రియాక్టర్‌లను కలిగి ఉన్న దేశం ఏది?
          జ)  అమెరికా.
    * టెలివిజన్ కనుగొన్న అనంతరం ప్రప్రథమంగ వినియోగంలోకి తెచ్చిన దేశం?
          జ)  బ్రిటన్.
    * 'క్రైం అండ్ మనీ లాండరింగ్ ' అనే గ్రంథ రచయిత ఎవరు?
          జ)  జ్యోతి ట్రెహన్.
    * క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో సేవలను అందిస్తున్న మొట్టమొదటి భారతీయ బ్యాంక్ ఏది?
          జ)  పంజాబ్ నేష్నల్ బ్యాంక్.
    * ప్రపంచంలో 100 అతి పెద్ద బిజినెస్ స్కూల్స్‌లో స్థానం సంపాదించిన ఏకైక భారతీయ మేనేజిమెంట్ విధ్యా సంస్థ ?
          జ)  ఐఐయం అహ్మదాబాద్.
    * బులెట్ ప్రూఫ్ కవచాన్ని దేనితో తయారుచేస్తారు?
          జ)  జాకాల్ అనే మిశ్రమంతో.
    * పవన విద్యుదుత్పత్తిలో ఆగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
          జ)  తమిళనాడు.
    * నీటి లోతును కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది?
          జ)  ఫాథమ్.
    * పింజర్ ' నవల రచయిత్రి ఎవరు?
          జ)  అమృతా ప్రీతమ్.
    * ప్రపంచంలో బౌద్దుల జనాభా అధికంగా గల దేశం ఏది?
          జ)  చైనా.
    * భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి?
          జ)  మహారాష్ట్ర
    * ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉంది?
          జ)  డెహ్రాడూన్.
    * వేలిముద్రల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు?
          జ)  డాక్టిలోగ్రఫీ.
    * రాణ్ ఆఫ్ కచ్ ' అనే ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది?
          జ)  గుజరాత్.
    * భారత జాతీయ చిహ్నం 3 సింహాల గుర్తు ఏ రోజు నుంచి అధికారికంగా అమలులోకి వచ్చింది?
          జ)  26 జనవరి 1950.
    * మహామన్య బిరుదు ఎవరికిచ్చారు?
          జ)  మదన్ మోహన్ మాలవ్య.
    * దాల్ సరస్సు ఎక్కడ ఉంది?
          జ)  శ్రీనగర్.
    * భారతదేశంలో తరచూ వరదలకు గురయ్యే రాష్ట్రం?
          జ)  అస్సాం.
    * అమెరికా అధ్యక్షుడి పదవీకాలం ఎంత?
          జ)  4 సంవత్సరాలు.






Followers