Pages

Menu Bar

RT

Tuesday, April 12, 2011

APRJC NOTIFICATION 2011, ఏపీఆర్‌జేసీ సెట్-2011


https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgOgSKqvt8ZueI7J1RpIhpGDZ811Q2VQ4K2e9pl2AfoLYKqjSIyL67bU74AYbQuJtLqvwA46OzdRSvymbPujE4JY2_vxw6RvEABfGOqRHuTWkGobXZYo4BJNRUhq13trLdhoAKOwHmzPj0/s1600/APRJC.JPG



ఉచిత విద్య, వసతి సౌకర్యాలతో ఇంటర్మీడియెట్ చదువుకునే అవకాశం ఏపీఆర్‌జేసీల ద్వారా దక్కుతుంది. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీలతో పాటు ఒకేషనల్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ విద్యతో పాటు ఎంసెట్, సీపీటీ పరీక్షలకు కూడా శిక్షణ అందించడం ఏపీఆర్‌జేసీల ప్రత్యేకత. బోధన, క్రమశిక్షణ రెండింటిలోనూ మేటి ఏపీఆర్‌జేసీలు. ఈ కళాశాలల్లో ప్రవేశం లభించాలంటే ఏపీఆర్‌జేసీ సెట్ రాయాల్సిందే. ఆ వివరాలు చూద్దామా....


ప్రత్యేకతలివీ..


ప్రతి అధ్యాపకుడికీ 15-20 మంది విద్యార్థులను కేటాయిస్తారు. వాళ్ల చదువు, క్రమశిక్షణ, వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహిం చడం, అసైన్‌మెంట్లు, మూల్యాంకనం, స్టడీ మెటీరియల్ అందించడం ఇవన్నీ ఆ అధ్యాపకుడే చూసుకుంటారు.


ప్రతిరోజూ నిర్దేశిత సమయాల్లో స్టడీ అవర్స్ నిర్వహిస్తారు. విద్యార్థులు వాళ్ల సబ్జెక్ట్ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి అధ్యాపకులు అందుబాటులో ఉంటారు.
విద్యార్థుల్లో శారీరక, మానసిక వికాసానికి ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ఫిజికల్ డెరైక్టర్ పర్యవేక్షణలో క్రీడలు నిర్వహిస్తారు.


రిఫరెన్స్ పుస్తకాలు, వార్తాపత్రికలు, మ్యాగజీన్లు, పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు ఇవన్నీ గ్రంథాలయంలో ఉంటాయి.
ఎంసెట్, ఏఐఈఈఈ, ఐఐటీ-జేఈఈ లాంటి పోటీ పరీక్షల కోసం ప్రత్యేక తర్ఫీదు అందిస్తారు. ప్రతి రోజూ ఉదయం 2 గంటలు ఈ పోటీ పరీక్షలకోసం శిక్షణ నిర్వహిస్తారు. ఇక్కడి విద్యార్థులు వివిధ పోటీ పరీక్షల్లో మంచి ప్రతిభ చూపుతున్నారు.


ఫీజులు నామమాత్రంగా ఉంటాయి. ఉచితంగా విద్య, భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. ప్రాథమిక వైద్యం అందించడానికి స్టాఫ్ నర్స్ అందుబాటులో ఉంటారు.
- పి.జగన్మోహన్‌రెడ్డి
కన్వీనర్, ఏపీఆర్‌జేసీ సెట్-2011


అర్హత: ఓసీ విద్యార్థులు 60, బీసీ, ఎస్సీలైతే 45 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణత. ఎస్టీ విద్యార్థులు పదోతగతి ఉత్తీర్ణత సాధిస్తే చాలు. ఈ సంవత్సరం పదోతరగతి పరీక్షలు రాసినవాళ్లు మాత్రమే అర్హులు.
ఇంటర్ కోర్సులు: ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ (తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాలు)
ఒకేషనల్ కోర్సులు: ఈఈటీ, సీజీడీఎం
బాలుర కళాశాలలు: నాగార్జునసాగర్, కొడిగెనహల్లి, వెంకటగిరి, గ్యారంపల్లి, సర్వేల్
బాలికల కళాశాలలు: తాడిపూడి, బనవాసి, హసన్‌పర్తి
కో ఎడ్యుకేషన్: నిమ్మకూరు
ముస్లిం మైనార్టీ బాలుర కోసం: గుంటూరు, కర్నూలు, నిజామాబాద్, హైదరాబాద్
దరఖాస్తుల లభ్యం: ఏప్రిల్ 15 వరకు
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 18
పరీక్ష తేదీ: మే 6, 2011
దరఖాస్తులు లభించే ప్రాంతాలు: ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు, గురుకుల కళాశాలలు, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో రూ. 150 చెల్లించి దరఖాస్తులు పొందొచ్చు.
చిరునామా: ద కన్వీనర్, ఏపీఆర్‌జేసీ సెట్, ఏపీఆర్ ఈఐ సొసైటీ, గగన్‌విహార్, నాలుగో అంతస్తు, ఎంజే రోడ్, నాంపల్లి, హైదరాబాద్- 500001
పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ ప్రశ్నలడుగుతారు. ఏ గ్రూప్‌కి దరఖాస్తు చేసుకున్నప్పటికీ 3 సబ్జెక్టుల్లో ఒక్కో సబ్జెక్టు నుంచి 50 ప్రశ్నలుంటాయి. ప్రశ్నలన్నీ పదోతగతి సిలబస్ నుంచే వస్తాయి. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు
ఒకేషనల్ కోర్సులు: ఈఈటీ, సీజీడీఎం ఈ రెండూ నిమ్మకూరులో మాత్రమే బోధిస్తున్నారు. ఆంగ్లమా ధ్యమం. ఒక్కో గ్రూప్‌లో 30 సీట్లు చొప్పున ఉన్నాయి. గ్రూప్‌ల వారీ కోస్తాకు 12, తెలంగాణకు 11, రాయలసీమకు 7 సీట్లు కేటాయించారు.మైనార్టీ సీట్ల కేటాయింపు: గుంటూరులోని సీట్లు కోస్తాంధ్రకు, కర్నూలు సీట్లను రాయలసీమకు కేటా యించారు. నిజామాబాద్ కాలేజీ సీట్లు వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన వారికి కేటాయించారు. హైదరా బాద్‌లోని సీట్లను మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన ముస్లిం మైనార్టీలకు కేటాయించారు.

Tags: APRJC NOTIFICATION 2011, ఏపీఆర్‌జేసీ సెట్-2011,APRJC, APRJC CET 2011,APRJC NOTIFICATION 2011.Pdf, ఏపీఆర్‌జేసీ సెట్-2011.Pdf.

No comments:

Post a Comment

Followers