టెన్త్ క్వాలిఫికేషన్‌తో కావచ్చు ఎక్సైజ్ కానిస్టేబుల్
కేవలం టెన్త్ ఉత్తీర్ణులై తమకు పెద్దగా ప్రభుత్వోద్యోగాలు రావడం లేదని ఆవేదన చెందుతున్న యువతీ యువకులకు శుభవార్త. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నుంచి
ఎక్సైజ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వెలువడనున్నది. దాదాపు రెండు దశాబ్థాల అనంతరం 2606 ఖాళీలు భర్తీచేయనున్నారు.
టెన్త్ క్వాలిఫికేషన్‌గల యువతీ యువకులకు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగావకాశాలు టెన్త్ వారికి అరుదుగా వస్తున్న నేపథ్యంలో రాష్ర్ట ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కానిస్టేబుల్ పోస్టులకు పోటీపడే అవకాశం కల్పిస్తున్నది. ఏకంగా 18 ఏళ్ళ తర్వాత 2600 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వెలువరించ నున్నది. ఈ అరుదైన అవకాశాన్ని టెన్త్ ఉత్తీర్ణులైన 10 లక్షల మంది ఉపయోగించుకునే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది.
ఎంపిక విధానం
తొలిదశ ః శారీరక సామర్థ్య పరీక్ష
-పురుష అభ్యర్థులు 4 కి.మీ.ల పరుగు పందెం 20 నిమిషాల్లో, మహిళలు 2 కి.మీ.ల పరుగుపందెం 1 నిమిషాల్లో పూర్తి చేయాలి. 100 మీటర్ల పరుగు పందెంను పురుషులు 15 సెకన్లు, మహిళలు 18 సెకన్లలో పూర్తిచేయాలి.
-హైజంప్ పురుషులకు 1.20 మీటర్లు. మహిళ లకు దీని నుంచి మినహాయించారు.
-లాంగ్‌జంప్ పురుషులకు 3.80 మీటర్లు. మహిళలు 2.75 మీటర్లలో అర్హత సాధించాలి.
-షాట్‌పుట్ (7.26 కిలోలు) పురుషులు 5.60 మీటర్లు, మహిళలు (4 కిలోలు) 4.5 మీటర్ల వరకు విసరాలి.
-పురుషులు 800 మీటర్ల పరుగుపందెంను 2.50 నిముషాల్లో పూర్తి చేయాలనే నిబంధన విధించారు.
మలిదశ ః రాత పరీక్ష
(100 మార్కులు - సింగిల్ పేపర్)
-జనరల్ స్టడీస్ ః 50 మార్కులు
-ఆప్టిట్యూడ్ టెస్ట్ ః 50 మార్కులు
ఫాస్ట్ ట్రాక్ ప్రవెూషన్స్
సివిల్ కానిస్టేబుల్ పోస్టులతో పోల్చుకుంటే 5-10 ఏళ్ళ ముందుగానే ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్ధులు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొంద వచ్చు. రాష్ర్ట పోలీసు శాఖలో 50 వేల మంది కానిస్టేబుళ్ళు విధులు నిర్వర్తిస్తున్నారు. అదే ఎక్సైజ్ డిపార్ట్‌మెంటులో కేవలం 5 వేల మంది కానిస్టేబుల్స్‌గా పనిచేస్తున్నారు. సీనియారిటీ ప్రాతిపదికన పదోన్నతులు కల్పించే ప్రక్రియలో ఎక్కువ సిబ్బంది ఉన్న చోట ఆలస్యంగా పదోన్నతులు లభిస్తుంటాయి. అదే తక్కువ సిబ్బంది ఉన్నచోట త్వరితగతిన పదోన్నతులు అందు తుంటాయి. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఎంపికైన 20 ఏళ్ళ యువకుడు 38 ఏళ్ళకు తన కెరీర్ ప్రస్థానంలో హెడ్ కానిస్టేబుల్, ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ స్థాయి వరకు పదోన్నతులు పొందుతూ కీలక స్థానాలకు చేరుకునే అవకాశం ఉంది.
రూ. 30 వేల కోట్ల ఆదాయం
రాష్ర్టంలో మధ్యం సరఫరా నియంత్రణ, ప్రత్యేక విధులు నిర్వర్తించే ఎక్సైజ్ డిపార్ట్‌మెంటు ఏటా రాష్ర్ట ప్రభుత్వానికే 30 వేల కోట్లు ఆర్జించి పెడుతోంది. రాష్ర్ట ప్రభుత్వ అనేక విభాగాలలో రెవెన్యూ డిపార్ట్‌మెంట్లు కీలకమైనవిగా గుర్తించటం అనాదిగా వస్తోంది. ఎక్సైజ్ డిపార్ట్‌మెంటు రెవెన్యూ శాఖల పరిధిలోకి వస్తుంది. రాష్ర్టప్రభుత్వానికి ఏటా ‘బంగారు కోడిపెట్ట’లా బంగారుగుడ్లు పెట్టే నాలుగైదు డిపార్ట్‌మెంట్లు ఉన్నాయి. అవి కమర్షియల్ టాక్స్ డిపార్ట్‌మెంటు, ఎక్సైజ్ డిపార్ట్‌మెంటు , ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంటు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంటు, గనుల శాఖ వంటివి ఉన్నాయి. రూ.50 వేల కోట్లు అందించే కమర్షియల్ టాక్స్ డిపార్ట్‌మెంటు తర్వాత రూ.30 వేల కోట్లు అందించి రెండోస్థానంలో నిలబడిన డిపార్ట్‌మెంటు ఎక్సైజ్.
ఎక్సైజ్ కానిస్టేబుల్ విధులు
రాష్ర్టవ్యాప్తంగా 324 ఎక్సైజ్ పోలీసు స్టేషన్లు ఉన్నాయి. ఎక్సైజ్ పోలీసుస్టేషన్‌కు ఉన్నతాధికారిగా ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వ్యవహరిస్తుంటారు. ఎక్సైజ్ స్టేషన్‌లో సి.ఐ.కు దిగువన ఎక్సైజ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఉంటారు. ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ లేదా ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో అక్రమ మద్యం సరఫరా స్థావరాలపై దాడులు చేసే క్రమంలో ఎక్సైజ్ కాని స్టేబుల్స్ నిర్దేశిత విధుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. అక్రమ సారా తయారీ, కల్తీకల్లు తయారీ, గంజాయి మొక్కలు పెంపకం, వైన్‌షాపులలో మద్యం అమ్మకాలు వంటి వేర్వేరు నిషేదిత, ఆవెూదిత కార్యక్రమాలు సజావుగా జరుగుతున్నాయా లేదానేది ప్రాథమిక సమాచార సేకరణలో ఎక్సైజ్ కానిస్టేబుల్స్ కీలక బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఉద్యోగ బాధ్యతలు చేపట్టే క్రమంలో సివిల్ డ్రెస్, యూనిఫాం డ్రెస్‌తో ఎక్సైజ్ కానిస్టేబుల్స్ విధులు చేపట్టాల్సి ఉంటుంది.
జిల్లా స్థాయి పోస్టులు
జిల్లా పరిధిని కేంద్రంగా చేసుకుని ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ చేపట్టారు. జిల్లాలో ప్రకటించే మొత్తం ఉద్యోగ ఖాళీలలో 80 శాతం పోస్టులు స్థానికులకు రిజర్వ్ చేస్తారు. రాత పరీక్షలో పోటీపడిన స్థానిక అభ్యర్ధులలో ఎవరైతే అత్యధిక మార్కులు స్కోర్ చేస్తారో వారితో 80 శాతం కాని స్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తారు. సదరు జిల్లాలో 4 నుంచి 10వ తరగతి వరకు అత్యధిక సంవత్సరాలు పాఠశాల విద్యనభ్యసించిన అభ్యర్ధులను స్థానికంగా గుర్తిస్తారు. ఇక మిగతా 20 శాతం ఖాళీలలో రాత పరీక్షకు పోటీపడిన జిల్లాస్థానికులు లేదా ఇతర జిల్లాలు స్థానికేతర అభ్యర్ధులు ఎవరైతే అత్యధిక మార్కులు సాధిస్తారో వారిని ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపిక చేస్తారు. ముందుగా 20 శాతం ఖాళీలు భర్తీ చేసి, ఆ తర్వాత 80 శాతం ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తారు.
హౌటు ప్రిపేర్ ?
రాతపరీక్ష సిలబస్ ః 10వ తరగతి స్థాయి
ఆబ్జెక్టివ్ టైప్ ః 100 ప్రశ్నలు
1. భారతదేశ చరిత్ర, భారతీయ సంస్కృతి, భారత జాతీయోద్యమం.
2. ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ మరియు ఎకానమీ.
3. జనరల్ సైన్స్
4. జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత యొక్క కరెంట్ ఈవెంట్స్
5. అర్థమెటిక్
6. టెస్ట్ ఆఫ్ రీజనింగ్/మెంటల్ ఎబిలిటి
7. జనరల్ ఇంగ్లిష్
సిలబస్ ఏమిటి?
ఎలాంటి ప్రశ్నలడుగుతారు?
నూతన పరీక్షావిధానంలో ప్రశ్నల స్థాయి 10వ తరగతి లోపునే ఉంటుంది. ప్రశ్నలసంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ సిలబస్ పరిధి మాత్రం ఎక్కవగానే ఉంటుంది. నూతన సిలబస్‌ను ఒక్కొక్క విభాగం నుండి ఎలాంటి ప్రశ్నలు ఇవ్వవచ్చో విపులంగా తెలుసుకుందాం...
భారతదేశ చరిత్ర
ఈ విభాగాన్ని వివరంగా పరిశీలిస్తే భారతదేశ చరిత్రలో మూడు భాగాలుంటాయి. అవి ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక చరిత్ర. హరప్పా నాగరికతా కాలం నుంచి ప్రారంభమై వేదయుగం, మౌర్యులు, గుప్తుల కాలం నాటి సాంఘిక, రాజకీయ, ఆర్థిక, మత పరిస్థితులు, అనంతరకాలంలో భారతదేశానికి అడుగిడిన అరబ్బులు, టర్కులు తరువాత మొఘల్ సామ్రాజ్య ఏలుబడిలో మారిన భారత రాజకీయ చిత్రపటం, భిన్న సంస్కృతుల మేళవింపు. ఇదే సమయంలో దక్షిణాదిన వెలుగు వెలిగిన బహమనీలు, విజయనగర రాజుల వరకు అదే కాలంలో వాణిజ్య ప్రయోజనాల దృష్ట్యా భారతదేశానికి అడుగిడిన శ్వేతజాతి ఆంగ్లేయులు, అనంతర కాలంలో భారతదేశ రాజకీయ ఆధిపత్యాన్ని కైవసం చేసుకోవడం వరకు జరిగిన సంగ్రామం, విదేశీయుల దాస్య శృంఖలాల నుంచి విముక్తి పొందటానికి భారతజాతి పోరాటం వరకు, ఇదే కాలంలో సామాన్య ప్రజల నాయకుడైన గాంధీజీ అహింస, సత్యా గ్రహాన్ని ఆయుధంగా దేశ స్వాతంత్య్రం తెప్పించడం వరకు గల అంశాలుంటాయి.

No comments:
Post a Comment