Pages

Menu Bar

RT

Tuesday, October 4, 2011

Nobel Prizes

వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి

వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతిని పంచుకున్న బ్యూట్లర్, హాఫ్మన్, స్టీన్మన్ రోగనిరోధక వ్యవస్థలో పరిశోధనలకు దక్కిన గౌరవం


స్టాక్హోమ్, 2011 అక్టోబర్ 3: నోబెల్ బహుమతుల సందడి మొదలైంది. కేన్సర్సహా పలు రకాల వ్యాధులచికిత్సలో సరికొత్త అవకాశాలను కనుగొన్న ముగ్గురు శాస్త్రవేత్తలకు ఉమ్మడిగా వైద్యరంగంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు. అమెరికాకు చెందిన బ్రూస్ బ్యూట్లర్, లగ్జెంబర్గ్కుచెందిన జూల్స్ హాఫ్మన్, కెనడాకు చెందిన రాల్ఫ్ స్టీన్మన్లు గౌరవాన్ని దక్కించుకున్నారు. రోగ నిరోధక వ్యవస్థకుసంబంధించిన కీలక సిద్ధాంతాలను కనిపెట్టడంద్వారా వీరు ముగ్గురూ విప్లవాత్మకకృషి చేశారని జ్యూరీ ప్రకటనలో తెలిపింది. బహుమతి గ్రహీతలలో ఒకరైన స్టీన్మన్ (68) గతనెల 30 పాంక్రియాటిక్ కేన్సర్తోమరణించారు. అయితే.. బహుమతి ప్రకటించిన కొద్ది గంటల తర్వాత గానీ, విషయం జ్యూరీకి తెలియలేదు. నిబంధనల ప్రకారం బహుమతిని మరణానంతరంప్రకటించేందుకు వీల్లేదు. కానీ, బహుమతి ప్రకటించి తర్వాతే తమకు స్టీన్మన్ మృతి విషయంతెలిసిందని జ్యూరీకి నేతృత్వం వహించిన గెరాన్ హాన్సన్ తెలిపారు. కొత్తగా మరో విజేతను ప్రకటించేదిలేదని, బహుమతి ఎలా ఇవ్వాలన్న విషయంలోనిబంధనలను పరిశీలిస్తామని అన్నారు. రోగనిరోధక శక్తి తగ్గడం వల్లవచ్చే ఆస్థమా, రుమటాయిడ్ ఆర్థరైటిస్, క్రాన్స్డిసీజ్ లాంటి వ్యాధులకు సరికొత్తమందులు కనిపెట్టేందుకు వీరి పరిశోధనలు ఉపయుక్తంగాఉంటాయని జ్యూరీ వివరించింది. మొత్తం రూ. 7.1 కోట్ల బహుమతిలో సగంమొత్తాన్ని బ్యూట్లర్, హాఫ్మన్లుపంచుకుంటా రు. మిగిలిన సగంస్టీన్మన్కువెళ్తుంది. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి డిసెంబర్ 10 స్టాక్హోమ్లోజరిగే కార్యక్రమంలో వీరు బహుమతులను అందుకుంటారు. కాగా.. ఆర్థిక, భౌతిక, రసాయన శాస్త్రాలు, సాహిత్యం, శాంతి విభాగాలలో నోబెల్ బహుమతులను త్వరలో ప్రకటించనున్నారు. అందులో భాగంగా నోబెల్ శాంతి బహుమతిని వచ్చేశుక్రవారం 7 తేదీన ఓస్లోలోప్రకటిస్తారు. ఈసారి విభాగానికిరికార్డు స్థాయిలో 241 నామినేషన్లు వచ్చాయి. ఈసారి ట్యునీషియా, ఈజిప్ట్, లిబి యా, సిరియా, యెమెన్, బహ్రెయిన్ లాంటి ప్రాంతాల్లో వచ్చినప్రజాస్వామ్య విప్లవాన్ని ముందుండి నడిపించిన యోధులలో ఎవ రో ఒకరికి బహుమతి రావచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. వీరిలో ట్యునీషియాకు చెందిన బ్లాగర్ లీనా బెన్ మెన్నీకిదక్కే అవకాశం ఉందని కూడా ఊహాగానాలువినిపిస్తున్నాయి. ఇంటర్నెట్లోవిప్లవాన్ని వ్యాప్తి చేయడంలో ఈమె కీలకపాత్ర పోషించారు. ఈజిప్టుకు చెందిన ఇస్రా అబ్దెల్ ఫతా, ఏప్రిల్ 6 నాటి ఉద్యమాలకు కూడారావచ్చని అంచనా ఉంది. కైరోలోనితెహ్రీర్ స్క్వేర్ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన అహింసా ఉద్యమకర్త, గూగుల్ అధికారి వేల్ ఘోనిమ్ కూడాఅవార్డు అందుకోడానికి అవకాశాలు ఉన్నాయంటున్నారు. గత సంవత్సరం జైల్లో న్న చైనా ఉద్యమకారుడులియు జియబావోకు శాంతి హుమతిదక్కింది. నోబెల్ సాహిత్య బహుమతికి వినపడుతున్న పేర్లలో మన దేశానికి చెందినవిజయదాన్ డెతా పేరు కూడాఉంది. పరిశోధనలు ఇవే శరీరంలోని రోగనిరోధకస్పందన వ్యవస్థలోని తొలి అంకా న్నిప్రేరేపించే రిసెప్టర్ ప్రోటీన్లను బ్యూట్లర్, హాఫ్మన్కనుగొన్నారు. శరీరంలోనే ఉండి ప్రమాదకరంగా పరిణమించేసూక్ష్మ జీవులను గుర్తించి వాటిపై దాడి చేయడంలో రోగనిరోధకవ్య వస్థకు సాయపడే డెండ్రిటిక్ కణాలను స్టీన్మన్కనుగొన్నారు.


Tags:Nobel Prizes,nobel prize winners ,Nobal prize ceremony, obama nobel prize, nobal prize ceremony

No comments:

Post a Comment

Followers